కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం..  - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం.. 

May 14, 2020

kjhg

శాంతించని కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ ప్రతిపాదనపై కేంద్రం మంత్రుల అభిప్రాయాలను కోరింది. మంత్రులు  సమీక్షించవలసిందిగా కోరుతూ.. ఇందుకు సంబంధించిన పత్రాలను ఆయా శాఖలకు పంపించింది. ఫీడ్‌బ్యాక్‌ను మంత్రులు, సంబంధిత అధికారులు మే 21 లోగా అందజేయాల్సి ఉంటుంది. ఇంటి నుంచి పనిచేయడానికి అవకాశం ఉండే కేంద్రప్రభుత్వ ఉద్యోగులు సంవత్సరంలో 15 రోజుల వరకు వర్క్‌ఫ్రం హోం చేసే అవకాశాలు ఉన్నట్లు ఆ డ్రాఫ్ట్‌ పేపర్ల ద్వారా తెలుస్తోంది. 

ఇదిలావుండగా మనదేశంలో  మొత్తం 48.34లక్షల మంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. కాగా, లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత కూడా మనం చాలా కాలంపాటు కరోనాతో కలిసి సహజీవనం చేయాల్సి ఉంటుందని భారత ప్రధాని నరేంద్రమోది అభిప్రాయ పడ్డ విషయం తెలిసిందే. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడటం నిత్యవసరంగా మారనున్నాయని పలువురు తెలిపారు. ఇప్పటివరకు భారతదేశంలో 78,000లకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, 2,549 మంది చనిపో​యారు. 26,000 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.