వాటిని ప్రసారం చేయొద్దు..టీవీ చానెల్స్‌కు కేంద్రం కీలక సూచనలు - MicTv.in - Telugu News
mictv telugu

వాటిని ప్రసారం చేయొద్దు..టీవీ చానెల్స్‌కు కేంద్రం కీలక సూచనలు

February 26, 2020

fvnn

దేశరాజధాని ఢిల్లీలో హింస చెలరేగిన సంగతి తెల్సిందే. ఈ అల్లర్లలో మృతిచెందిన వారికి సంఖ్య 13కు చేరింది. పరిస్థితి చేజారడంతో ఈశాన్య ఢిల్లీలో కనిపిస్తే కాల్చివేసే ఉత్తర్వులు జారీ చేశారు. పారామిలటరీ బలగాలు, పెద్ద సంఖ్యలో పోలీసులను రంగంలోకి దిగాయి. ఈశాన్య ఢిల్లీలోని నాలుగు ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ న్యూస్ చానెల్స్‌కు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ కీలక సూచనలు చేసింది. 

కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ యాక్ట్ ప్రకారం ప్రైవేట్ శాటిలైట్ టీవీ చానెల్స్‌ ఈ క్రింది సూచనలు పాటించాలని పేర్కొంది. దేశ వ్యతిరేక కార్యకలపాలను ప్రోత్సహించేలా టీవీ కార్యక్రమాలు ఉండకూడదు. అందుకు సంబంధించిన ఎలాంటి వీడియోలను ప్రసారం చేయకూడదని పేర్కొంది. ఇక, ఏదైనా మతాన్ని కానీ, కులాన్నీ కానీ కించ పర్చేలా ఉన్న వీడియోలు గానీ.. పదాలను గానీ టీవీ చర్చా కార్యక్రమాల్లో ప్రసారం చేయకూడదని ఆదేశించింది. మరోవైపు, వ్యక్తుల ప్రాథమిక హక్కులకు.. ఆయా వ్యక్తులకు భంగం వాటిల్లేలా కార్యక్రమాలు ఉండకూడదని కోరింది. ఈ మేరకు మంగళవారం రాత్రి సమాచార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.