Central government has abolished tax on petrol mixed with ethanol
mictv telugu

గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఆ పెట్రోల్‌పై ఎక్సైజ్ సెస్ ఎత్తివేత

July 5, 2022

Central government has abolished tax on petrol mixed with ethanol

అంతర్జాతీయ పరిణామాల వల్ల చమురు ధరలు ఈ మధ్య విపరీతంగా పెరగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మనదేశంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెరిగిన ధరలకు ఉపశమనంగా గతంలో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఇప్పుడు మరో ముందడుగేసి ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై పూర్తిగా ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాక, బయోడీజిల్‌పై కూడా పన్నులను రద్దు చేస్తున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది.

కాగా, ఇప్పటివరకు కేవలం 10 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌కే పన్ను ప్రయోజనాలు కల్పించారు. ఇప్పుడు దానిని 12 నుంచి 15 శాతానికి పెంచారు. ఇదిలా ఉండగా, వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. చమురు దిగుమతులను తగ్గించడం, తద్వారా విదేశీ మారక ద్రవ్యం నిల్వలను కాపాడడం, క్లీన్ ఎనర్జీ వంటి లక్ష్యాల కోసం కేంద్రం ఇటువంటి చర్యలు తీసుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.