2021 సంవత్సరంలో దేశవ్యాప్తంగా జనాభా గణన నిర్వహించనున్నారు. తొలిసారి జనాభా గణనను 16 భాషల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. పార్లమెంటుకు ఆయన ఈ విషయం తెలిపారు.
2021లో నిర్వహించే జనాభా లెక్కల కోసం ప్రత్యేకంగా ఓ మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగిస్తామని వెల్లడించారు. ఈ విషయాన్ని గతంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వెల్లడించిన సంగతి తెల్సిందే. సాంకేతిక సలహా కమిటీ సూచన మేరకు జనాభా లెక్కల్లో భాగంగా అడిగే ప్రశ్నలను స్పల్పంగా మారుస్తున్నట్లు నిత్యానంద్ వెల్లడించారు. ఖర్చు అంచనాల కమిటీ నివేదిక ప్రకారం 2021లో చేపట్టబోయే జనాభా గణనకు సుమారు రూ.8,754 కోట్లు ఖర్చవుతుందని ఆయన తెలిపారు. 2021 జనాభా లెక్కల కోసం ఇప్పటికే సిబ్బందికి గురుగ్రామ్‌లో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంస్థలో శిక్షణ ఇస్తున్నారు. గతంలో 2011లో జనాభా గణన జరిగింది. 2011 జనాభా ప్రకారం భారత్‌లో 121కోట్ల జనాభా ఉందని తేలింది.