Central Government Released Rs.879 crores as Revenue Deficit Funds To Andhra Pradesh
mictv telugu

రాష్ట్రానికి కేంద్రం గుడ్ న్యూస్.. రూ. 879 కోట్ల నిధుల విడుదల

November 9, 2022

పీకల్లోతు అప్పులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీకి కేంద్ర ప్రభుత్వం మంగళవారం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థిక లోటుతో సతమతమవుతుందని రెవెన్యూ లోటు భర్తీ కింద రాష్ట్రానికి రూ.879 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఇప్పటికే పలు విడతల కింద ఏపీకి కేంద్రం రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దేశంలోని 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసిన కేంద్రం.. ఏపీకి రూ.879 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులతో ఈ ఏడాది ఏపీకి రెవెన్యూ లోటు కింద రూ.7,032 కోట్లను కేంద్రం విడుదల చేసినట్టయింది.

దేశవ్యాప్తంగా రెవెన్యూ లోటుతో 14 రాష్ట్రాలు సతమతమవుతున్నాయి. వాటిలో ఏపీతో పాటు రాజస్థాన్, పంజాబ్, మణిపూర్, కేరళ, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ మిజోరాం, , అసోం, సిక్కిం, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ లు ఉన్నాయి. ఈ రాష్ట్రాల రెవెన్యూ లోటు భర్తీ కోసం మంగళవారం కేంద్రం రూ.7,183 కోట్లను విడుదల చేసింది. వీటిలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్ కు రూ.1,132 కోట్లు విడుదలయ్యాయి.