ఒక్క గింజ కూడా కొనట్లేదు : కేంద్రం ప్రకటన - MicTv.in - Telugu News
mictv telugu

ఒక్క గింజ కూడా కొనట్లేదు : కేంద్రం ప్రకటన

April 11, 2022

bfcnbdf

యాసంగి ధాన్యం విషయంలో కేంద్రం, రాష్ట్రం మధ్య జరుగుతున్న వివాదం తెలిసిందే. కేసీఆర్ ఢిల్లీలో దీక్ష చేపట్టి కేంద్రానికి 24 గంటల గడువిస్తున్నానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది. దేశంలో ఏ రాష్ట్రం నుంచి కూడా పారాబాయిల్డ్ రైస్ కొనట్లేదని తేల్చి చెప్పింది. కొద్దిసేపటి క్రితం కేంద్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ప్రస్తుతం ఏ రాష్ట్రం నుంచి కూడా ఉప్పుడు బియ్యం తీసుకోవట్లేదు. పంజాబ్ నుంచి కూడా తీసుకోలేదు. కేంద్రం నేరుగా ధాన్యాన్ని తీసుకోదు. ధాన్యాన్ని మిల్లింగ్ చేసినందుకు మిల్లర్లకు డబ్బులు చెల్లిస్తాం. ఆంధ్ర, తెలంగాణ ఒకే వాతావరణం కలిగి ఉన్నాయి. ఏపీలో రాని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తుంది? ఇప్పటికే దేశంలో ఒకే ప్రొక్యూర్‌మెంట్ విధానాన్ని అనుసరిస్తున్నామ’ని వెల్లడించారు. కాగా, 24 గంటల గడువిచ్చిన కేసీఆర్ రేపు క్యాబినెట్ భేటీకి సమాయాత్తం అవుతున్నారు. కేంద్రం స్పందన పై విధంగా ఉండడంతో కేసీఆర్ ఏం చేస్తారనే కుతూహలం రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది.