Central Government to officially celebrate Telangana Liberation Day
mictv telugu

అధికారికంగా విమోచన దినోత్సవం.. హాజరుకానున్న అమిత్ షా

September 2, 2022

Central Government to officially celebrate Telangana Liberation Day

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పోరాడుతున్న బీజేపీ అందుకు తగ్గట్టుగా పావులు కదుపుతోంది. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నిక ఖాయం కాగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బహిరంగ సభ జరిపి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు మరో మెగా ఈవెంటుకి కేంద్రం సిద్ధపడింది.

ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పరేడ్ గ్రౌండ్‌లో జరిగే ఈ సభకు ముఖ్య అతిథులుగా అమిత్ షాతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు బస్వరాజ్ బొమ్మై, ఏక్ నాథ్ షిండేలు హాజరుకానున్నారు. ఈ మేరకు కేంద్రం నుంచి శుక్రవారం ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కాగా, నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తం అయిన రోజున విమోచన దినోత్సవంగా పాటిస్తున్న విషయం తెలిసిందే. నిజాం పాలనలో కర్ణాటక, మహారాష్ట్రలలోని కొన్ని ప్రాంతాలు ఉండేవి. తర్వాత కాలంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఆయా ప్రాంతాలు ఆయా రాష్ట్రాల్లో విలీనమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు రాష్ట్రాలు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఇప్పటికే జరుపుకుంటున్నాయి.