Bhagavad Geeta: కేంద్ర సర్కార్ సంచలన నిర్ణయం...సెంట్రల్ సిలబస్‎లో భగవద్గీత - MicTv.in - Telugu News
mictv telugu

Bhagavad Geeta: కేంద్ర సర్కార్ సంచలన నిర్ణయం…సెంట్రల్ సిలబస్‎లో భగవద్గీత

March 14, 2023

కేంద్రంలోని మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ సిలబస్ లో భగవద్గీత బోధించాలని ఆదేశాలు జారీ చేసింది. సీబీఎస్ఈలో ఆరు,ఏడు తరగతులలో భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మోదీ సర్కార్ తీసుకువస్తున్న కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా పాఠ్యాంశంలో భగవద్గీతను చేర్చనున్నారు. అంతేకాదు భగవద్గీతలోని శ్లోకాలను పదకొండు, పన్నెండవ తరగతులలో సంస్కృత పుస్తకాలలో పాఠ్యాంశాలుగా చేర్చుతున్నట్లు కేంద్ర మంత్రి పార్లమెంట్ లో ప్రకటించారు.