ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత ఆన్లైన్ షాపింగ్‌కు డిమాండ్ పెరిగింది. ఇంట్లో ఉండే కావాల్సిన వస్తువులను తెప్పించుకుంటున్నారు. దీంతో పండగ సీజన్, వికెండ్ వచ్చిందంటే చాలు ఈ కామర్స్ సంస్థలు కూడా వారిని ఆకట్టుకునేలా ప్రత్యేక ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పోటీ పడి వస్తువులపై డిస్కౌంట్లు ఇస్తూ అమ్ముకుంటున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది.
ఈ కామర్స్ సంస్థలు అమ్ముకునే వస్తువులు ఏ దేశంలో తయారయ్యాయనే సమాచారం పొందుపరచక పోవడంపై అసహనం వ్యక్తం చేసింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలంటూ రెండు నోటీసులు జారీ చేసింది. కచ్చితంగా వాటి మూలాలను వినియోగదారుడికి తెలిసేలా పొందుపరచాలని సూచింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు 15 రోజుల సమయం కూడా ఇచ్చింది. ఈ నిబంధనలను ప్రతి ఈ కామర్స్ సంస్థ పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.