బీజేపీకి షాక్.. కేంద్రమంత్రి రాజీనామా - MicTv.in - Telugu News
mictv telugu

 బీజేపీకి షాక్.. కేంద్రమంత్రి రాజీనామా

September 17, 2020

Harsimrat Kaur Badal resigns from Union Cabinet as Akali Dal opposes farm Bills

కేంద్రంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. కేంద్ర ఆహారశుద్ధి పరిశ్రమల శాఖామంత్రి హర్ సిమ్రత్ కౌర్ తప పదవికి రాజీనామా చేశారు. ప్రధాని కార్యాలయానికి వెళ్లి ఆమె రాజీనామా సమర్పించారు. వ్యవసాయ బిల్లులపై అకాలీదళ్‌ అభ్యంతరం వ్యక్తం చేసిన తరుణంలో బిల్లులకు నిరసనగా ఆమె రాజీనామా చేశారు.  రెండు వ్యవసాయ బిల్లులకు సంబంధించి వ్యతిరేకంగా ఓటు వేస్తామని కేంద్రం చెప్పింది. రైతులకు, వ్యవసాయ సంబంధిత బిల్లుల విషయంలో ప్రభుత్వ నిర్ణయంతో విభేదించిన ఆ పార్టీ లోక్‌సభలో ఈరోజు చర్చలు జరుగుతున్న సమయంలోనే నిరసనకు దిగింది. 

కేంద్రమంత్రి పదవి నుంచి హర్‌ సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ తప్పుకుంటున్నారంటూ ఆ పార్టీ అధినేత సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ ప్రకటించారు. అనంతరం లోక్‌సభ నుంచి నేరుగా ప్రధాని కార్యాలయానికి హర్‌సిమ్రత్‌ కౌర్‌ చేరుకొన్నారు. కాసేపటి క్రితమే ఆమె రాజీనామా సమర్పించారు. ప్రభుత్వం నుంచి బయటికి వచ్చి ఎన్డీఏలో కొనసాగేందుకు అకాలీదళ్‌ తీర్మానం చేసింది. రేపు సభలో వ్యవసాయ బిల్లు ఓటింగ్‌కు రానున్న నేపథ్యంలో హర్‌సిమ్రత్ కౌర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.