కేంద్ర మంత్రినే నిలదీసింది... - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్ర మంత్రినే నిలదీసింది…

November 22, 2017

ప్రధాని నరేంద్రమోదీ.. వీఐపీ విధానానికి స్వస్తి చెప్పాలని ఆదేశించినా మన దేశంలో ఆ సంస్కృతి  ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశంలో ఎక్కడికెళ్లినా వీవీఐపీల కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.


తాజాగా గురువారం  మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోను కేంద్ర మంత్రి కేజే అల్ఫోన్స్ కారణంగా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. కేంద్ర మంత్రి వస్తున్నారంటూ  అధికారులు నానా హడావిడీ చేశారు. ఆల్ఫోన్స్ వల్ల ప్రయాణికులు విమానాలు ఆలస్యమై ఇబ్బంది పడ్డారు.

అది చూసి ఓపిక నశించిన ఓ ప్రయాణికురాలు నేరుగా సదరు కేంద్ర మంత్రి వద్దకే వెళ్లి అతణ్ని  కడిగి పారేసింది. ‘కేవలం ఒక్కరి కారణంగా మేం నరకం అనుభవిస్తున్నాం.. పద్ధతి మార్చుకోండి.. ’ అని దులిపి పారేసింది.  తాను  డాక్టర్‌నని,  పేషంట్‌కు చికిత్స చేయడానికి వెళ్తున్నానని, మీ వల్ల  ఆలస్యం అయిందని తీవ్రంగా మండిపడింది. ఆయనతోపాటుగా అక్కడనున్న అధికారులందరినీ  కడిగేసింది. కంగుతిన్న మంత్రి ఆమెను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.