చెట్టెక్కిన కేంద్రమంత్రి..! - MicTv.in - Telugu News
mictv telugu

చెట్టెక్కిన కేంద్రమంత్రి..!

June 5, 2017

ఊళ్లో సిగ్నల్ రాకపోతే… వాటర్ ట్యాంకో …మరో ఎత్తైన బిల్డింగో ఎక్కుతాం. కానీ ఓ కేంద్రమంత్రి చెట్టు ఎక్కేశాడు. అదీ 62 ఏళ్ల వయస్సులో. చెట్టు ఎక్కి ఫోన్ మాట్లాడారు. మంత్రి ఏంటీ ..చెట్టు ఎక్కడమేంటీ అనుకున్నారా…

చెట్టుక్కెన ఈయన కేంద్రమంత్రి అర్జున్ మేఘ్వాల్..త‌న పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం బిక‌నూర్ లోని ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడ ఆయ‌న‌ను ఫోన్ సిగ్న‌ల్స్ ఇబ్బంది పెట్టాయి. గ్రామంలోని ప్ర‌జ‌లు వాళ్లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు విన్న అర్జున్ మేఘ్వాల్… ఫోన్ లో సంబంధిత అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఫోన్ చేస్తుంటే అస్స‌లు వాళ్ల‌కు ఎంతకు క‌నెక్ట్ అవ్వ‌లేదు. సిగ్నల్ ప్రాబ్లంతో ఏం చేయాలో తెలియ‌ని మంత్రికి ఓ మంచి స‌ల‌హా ఇచ్చారు స్థానికులు.

అక్క‌డే ఉన్న ఓ చెట్టు ఎక్కితే సిగ్న‌ల్ వ‌స్తుంద‌ని చెప్పారు. చెట్టు ఎక్క‌డానికి నిచ్చెన‌ను కూడా ఏర్పాటు చేశారు. వెంట‌నే నిచ్చెన‌ను ప‌ట్టుకొని చెట్టు ఎక్కి మ‌రీ.. సంబంధిత అధికారుల‌తో మాట్లాడి గ్రామంలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల్సిందిగా ఆర్డ‌ర్ వేశారు కేంద్రమంత్రి. అంతేకాదు.. గ్రామంలో నెట్ వ‌ర్క్ ప్రాబ్ల‌మ్ ను ప‌రిష్క‌రించ‌డానికి…రూ. 13 ల‌క్ష‌ల తో మొబైల్ ట‌వ‌ర్స్ ను ఏర్పాటు చేయ‌డానికి నెట్ వ‌ర్క్ కంపెనీల‌తోనూ మాట్లాడారు. 62 ఏళ్ల వ‌య‌సులో అతి క‌ష్టం మీద నిచ్చెన‌తో చెట్టు ఎక్కి బ్యాలెన్స్ చేసుకుంటూ అధికారుల‌తో ఫోన్ లో మంత్రి మాట్లాడిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరు ఎంపీలూ ఈయనలాగే గ్రామాలకు ప్రజలతో ఎన్నో సమస్యలు అర్థమయ్యేవి..తక్షణమే పరిష్కారం అయ్యేవి కదూ..