ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి..  వైసీపీ నేత రామచంద్రయ్య - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి..  వైసీపీ నేత రామచంద్రయ్య

April 17, 2019

తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11నే ఎన్నికలు పూర్తయినా.. రాజకీయ వేడి మాత్రం ఇంకా కొనసాగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఓ వైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తుంటే… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం చంద్రబాబు తీరుని తప్పుబడుతూ గవర్నర్ నరసింహాన్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో ఏపీలో పరిస్థితులు దిగజారుతున్నాయని.. శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆరోపించిన వైసీపీ నేత రామచంద్రయ్య… ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చేలోపు చంద్రబాబు రికార్డులను ట్యాంపర్ చేసే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. పరిస్థితులు అదుపులో ఉండాలంటే రాష్ట్రపతి పాలన తప్పనిసరని వ్యాఖ్యానించారు.