Centre Bans Popular Front Of India For 5 Years, Cites "Terror Links"
mictv telugu

పీఎఫ్‌ఐపై కేంద్రం నిషేధం.. తక్షణం అమల్లోకి

September 28, 2022

పీఎఫ్‌ఐ(పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా)పై కేంద్రం నిషేధం విధించింది. పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థలపై ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. యూఏపీఏ చట్టం కింద ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులను అందించడంతోపాటు యువతకు శిక్షణ ఇస్తున్నారనే ఆరోపణలపై పీఎఫ్‌ఐ కార్యాలయాలపై దేశవ్యాప్తంగా భారీ ఆపరేషన్‌ను కేంద్ర హోంశాఖ చేపట్టిన విషయం తెలిసిందే. ఇటీవల పట్నాలో ప్రధాని మోదీ హత్యకు కూడా కుట్ర చేసినట్లు ఆరోపణలన్నాయి.

దేశంలోని ఆరెస్సెస్‌, బీజేపీ అగ్ర నేతలే టార్గెట్‌గా పన్నాగం పన్నింది పీఎఫ్‌ఐ. ఎన్‌ఐఏ దర్యాప్తులో నాగ్‌పుర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం పీఎఫ్‌ఐ టార్గెట్‌ లిస్ట్‌లో ఉందని తెలిసింది. దసరా వేళ మహారాష్ట్రలో ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ సభ్యుల కదలికలపై నిఘా పెట్టాలని ఈ సంస్థ ప్రణాళికలు చేసినట్లు తెలుస్తోంది. వీరిని టార్గెట్‌ చేసుకుని దేశంలో మతవిద్వేషాలను రెచ్చగొట్టాలని కుట్రలు పన్నుతున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. బీజేపీ, సంఘ్‌నేతలతో పాటు పలు ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అధికారులు కూడా వీరి హిట్‌ లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.