ఆన్‌లైన్‌లో మద్యం విక్రయాలకు ఢిల్లీ హైకోర్టు నో - MicTv.in - Telugu News
mictv telugu

ఆన్‌లైన్‌లో మద్యం విక్రయాలకు ఢిల్లీ హైకోర్టు నో

May 12, 2020

Centre, Delhi govt inform high courtof early decision about online liquor sales

నెలన్నర తర్వాత మద్యం విక్రయాలు జరగడంతో దేశంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. లాక్‌డౌన్‌ను సడలిస్తూ వలస కార్మికులను వారివారి స్వస్థలాలకు పంపుతుండగా.. మరోవైపు మద్యం విక్రయాలతో మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతాయేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో మద్యం విక్రయాలను నిలిపేయాల్సిన అవసరం లేదని.. ఆదాయం సమకూర్చుకునేందుకు మద్యం విక్రయాలు జరుపుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆన్‌లైన్ ద్వారా మద్యం విక్రయాలను అనుమతించబోమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. వైన్ షాపుల వద్ద భౌతికదూరం పాటించడమే కాకుండా, లాక్‌డౌన్ నిబంధనలు తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ప్రభుత్వం హామీ ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు కేంద్రంతో పాటు ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 

కాగా, కొన్ని రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతుండగా తమిళనాడులో మాత్రం కోర్టు ఆదేశాల మేరకు మద్యం దుకాణాలు మూసివేశారు. లాక్‌డౌన్ కారణంగా ఆదాయం లేక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దివాళా తీశాయి. దీంతో మద్యం విక్రయాలు జరపక తప్పని పరిస్థితి ఏర్పడింది.