ఎవరిని అడిగి పెంచారు.. ఇప్పుడెందుకు తగ్గించామంటున్నారు? - MicTv.in - Telugu News
mictv telugu

ఎవరిని అడిగి పెంచారు.. ఇప్పుడెందుకు తగ్గించామంటున్నారు?

May 22, 2022

పెట్రోల్‌, డీజిల్‌ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలను పన్నులకు తగ్గించాలని కోరడంపై తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్‌ తీవ్రంగా మండిపడ్డారు. పెట్రోల్‌పై ట్యాక్సులు పెంచినప్పుడు ఏ రాష్ట్రాన్ని అడిగారు, కనీసం సమాచారమైనా ఇవ్వలేదని.. ఇప్పుడు మాత్రం వ్యాట్‌ను తగ్గించాలని రాష్ట్రాలను అడుగుతున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశించి అన్నారు.

 

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరల్ని పెంచినప్పుడు రాష్ట్రాల అభిప్రాయాల్ని తీసుకోలేదని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుందన్నారు. 2014 తర్వాత లీటర్‌ పెట్రోల్‌పై రూ.23 (250%), డీజిల్‌పై రూ.29 (900%) పెంచిందని చెప్పారు. ఆ పెంచిన మొత్తం నుంచి ఇప్పుడు కొంత తగ్గించి.. రాష్ట్రాలు కూడా (VAT)పన్నులు తగ్గించాలని హితబోధ చేస్తోందని ఎద్దేవా చేశారు. సమాఖ్య స్ఫూర్తి అంటే ఇదేనా? అంటూ త్యాగరాజన్‌ ట్విటర్‌ వేదికగా కేంద్రాన్ని ప్రశ్నించారు.