బంగ్లా ఖాళీ చెయ్..ప్రియాంకా గాంధీకి నోటీసులు - MicTv.in - Telugu News
mictv telugu

బంగ్లా ఖాళీ చెయ్..ప్రియాంకా గాంధీకి నోటీసులు

July 1, 2020

Priyanka Gandhi

కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇటీవల ఆమె భద్రతను తగ్గించిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఆమె భద్రతను జడ్ ప్లస్ కేటగిరీకి తగ్గించారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని లోథీ రోడ్‌లో ఆమె నివాసం ఉంటున్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని కేంద్ర పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ ఈరోజు ఆమెకు నోటీసులు జారీ చేసింది. 

ప్రియాంక గాంధీ ఎస్పీజీ భద్రత పరిధిలో లేనందున 35, లోడీ ఎస్టేట్స్‌ ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని కోరింది. ఆగస్టు 1లోగా బంగ్లా ఖాళీ చేయాలని స్పష్టం చేసింది. అంతకంటే ముందు పెండింగ్ బిల్లులన్నీ చెల్లించాలని పేర్కొంది. ఆగస్టు 1 తర్వాత కూడా ప్రభుత్వ బంగ్లాలో కొనసాగితే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని లేఖలో వెల్లడించింది.