15 నుంచి థియేటర్లు ఓపెన్.. స్కూళ్లు కూడా..  - MicTv.in - Telugu News
mictv telugu

15 నుంచి థియేటర్లు ఓపెన్.. స్కూళ్లు కూడా.. 

September 30, 2020

 centre Releases Unlock 5.0 Guidelines: What Will Reopen, What Will Remain Closed

సినీ ప్రేమికులకు కేంద్రం శుభవార్త తెలిపింది. అన్‌లాక్ 5.oలో థియేటర్లు తెరుచుకోడానికి అనుమతి ఇచ్చేసింది. వచ్చే నెల.. అంటే అక్టోబర్ 15 నుంచి హాళ్లను, మల్టీప్లెక్సులను తెరుచుకోవచ్చని, అయితే 50 శాతం సీట్లను ఖాళీగా వదిలేయాలని స్పష్టం చేసింది. స్కూళ్లను కూడా తెరవొచ్చని, ఈ విషయంలో మాత్రం నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలదేనని చెప్పింది. ఆన్ లైన్ క్లాసులు కూడా నిర్వహించుకోవచ్చని సూచించింది. 

5వ అన్‌లాక్ కింద.. వ్యాపారపరమైన ఎగ్జిబిషన్లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్స్‌ను కూడా తెరవొచ్చు. అయితే క్రీడాకారులకే అనుమతి ఉంటుంది. పార్కులు, ఎంటర్‌టైన్‌మెంట్ ప్లేసులను కూడా తిరిగి ప్రారంభించుకోవచ్చు. తెరుచుకోబోయేవి ఏవైనా కరోనా వ్యాధి సోకుండా తగిన ముందుజాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. వివిధ సమావేశాలు కూడా జరుపుకోవచ్చని, అయితే 200 మందికంటే ఎక్కువ మంది హాజరు కూడూదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే కంటైన్మెంట్ జోన్లలో పలు  సర్వీసులకు అనుమతి ఉండదని పేర్కంది. అక్కడ పార్కులను మూసే ఉంచాలని, ఆయా జిల్లాల కలెక్టర్లు కంటైన్మెంట్ జోన్లను ప్రకటిస్తారని పేర్కొంది.