కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చైనాతో లింకులున్న 200కి పైగా యాప్‌లను నిషేధించింది. ఇందులో 138 యాప్‌లు బెట్టింగ్‌కు సంబంధించినవి కాగా, 94 యాప్‌లు లెడింగ్ విభాగానికి చెందినవి. ఈ యాప్స్ అన్నీ కూడా చైనాతో సంబంధం కలిగి ఉండటం గమనార్హం. అందుకే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ యాప్స్‌పై ఉక్కుపాదం మోపింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఐటీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఆరునెలల క్రితమే చైనా యాప్‌లపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సిఫారసు చేసింది.
చైనా యాప్ లోన్ల పేరుతో వేధింపులకు గురిచేస్తునట్టు కేంద్ర హోంమంత్రిత్వశాఖ దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా గూఢచర్యానికి కూడా ఇవి కారణమవుతున్నట్టు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తించింది. అందుకే బ్యాన్ విధించాలని నిర్ణయించారు. యాప్స్ నిషేధానికి సంబంధించి ఆదేశాలు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు అందినట్లు మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ఈ మంత్రిత్వ శాఖ ఇప్పటికే యాప్స్ బ్లాక్‌కు సంబంధించి పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. అర్జంట్, ఎమర్జెన్సీ ప్రాతిపదికన ఈ యాప్స్‌ను కేంద్రం నిషేధించింది.