పేదలకు ఉచిత ధాన్యం.. రెట్టింపైన పేదల సంఖ్య - MicTv.in - Telugu News
mictv telugu

పేదలకు ఉచిత ధాన్యం.. రెట్టింపైన పేదల సంఖ్య

April 23, 2021

Centre to give 5 kg free foodgrain to 80 crore poor for next 2 months

కరోనా కష్టాలతో ఎక్కువగా నష్టపోతున్న పేదలను ఆదుకోడానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి ముందుకొచ్చింది. మే, జూన్ నెలల్లో వారికి అదనపు ఆహార ధాన్యాలను ఉచితంగా ఇవ్వనుంది. కరోనా లాక్డౌన్ సమయంలో ఇచ్చినట్లుగానే ఈసారీ ఇస్తామని తెలిపింది. ప్రధానమంత్రి గరీబ్ అన్న యోజన పథకం కింద.. రాబోయే రెండు నెలల పాటు పేదలకు ఉచితంగా ఆహారధాన్యాలు అందుతాయని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఒక్కొక్కరికి 5 కేజీల బియ్యం,లేదా గోధుమలు అందిస్తారు. 80 కోట్ల మందికి లబ్ది చేకూరనుంది. కేంద్రంపై రూ. 26,000 కోట్ల భారం పడనుంది.

మరోవైపు.. కరోనా కష్టాల కారణంగా గత ఏడాది మన దేశంలో పేదల సంఖ్య రెట్టింపైనట్లు ఓ అధ్యయనంలో తేలింది. అమెరికాలోని పియో పరిశోధనా కేంద్రం జరిపిన అధ్యయనం ప్రకారం.. కరోనా ముందు భారత్‌లో రోజుకు రూ. 150 కంటే తక్కువ సంపాదించేవారు 6 కోట్లుగా ఉండగా ఈ ఏడాది ఆ సంఖ్య 13.4 కోట్లకు చేరింది. రోజు ఆదాయం 750-1500 మధ్య ఉన్నవారి సంఖ్య 9.9 కోట్ల నుంచి 6.6 కోట్లకు తగ్గింది. ఫ్యాక్టరీ కార్మికులు పెద్దసంఖ్యల ఉద్యోగాలు కోల్పోయారు.