మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతం రెండింతలు పెరిగే చాన్స్ - MicTv.in - Telugu News
mictv telugu

మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతం రెండింతలు పెరిగే చాన్స్

May 17, 2022

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సంస్థ తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. గ్రేట్ రెజిగ్నేషన్‌ను అడ్డుకట్ట వేసేందుకు ఉద్యోగుల జీతాలను దాదాపు రెండింతలు చేస్తామని వెల్లడించింది. ఈ విషయాన్ని సంస్థ సీఈఓ సత్యనాదెళ్ల సిబ్బందికి ఈ మెయిల్ ద్వారా వెల్లడించారు.

మెక్రోసాఫ్ట్ సంస్థ యొక్క కస్టమర్లు, భాగస్వాములకు మెరుగైన సేవలు అందించడంలో కంపెనీ ఉద్యోగులు కీలక ప్రాత పోషించారని, ఈ విషయంలో వారికి బయట అధిక డిమాండ్ ఉందని మెయిల్‌లో పేర్కొన్నారు సత్య నాదెళ్ల. అందుకు ఉద్యోగులందరికీ థ్యాంక్స్ చెబుతూ వారిపై దీర్ఘ‌కాల పెట్టుబ‌డుల‌కు తాము సిద్ధ‌మ‌య్యామ‌ని మెయిల్‌లో తెలిపారు. గ్లోబల్ మెరిట్ బడ్జెట్‌ను రెట్టింపు చేస్తున్నామని, ఈ పెంపు స్థానిక డేటా ఆధారంగా వివిధ దేశాల్లో ఒక్కోరకంగా ఉంటుందని నాదెళ్ల తెలిపారు.

తమ టాలెంట్‌ బయటకు వెళ్లిపోకుండా కాపాడుకునేందుకు పలు సంస్థలు ఇదే తరహా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫిబ్రవరిలో కార్పొరేట్, టెక్ ఉద్యోగుల మూల వేతనాన్ని అమెజాన్‌ సంస్థ దాదాపు రెట్టింపు చేసింది. జనవరిలో గూగుల్ కూడా ఇదే తరహాలో తన నలుగురు టాప్‌ ఎగ్జిక్యూటివ్స్ జీతాలను భారీగా పెంచింది.