తెలంగాణ సాగుకు కేంద్రం చేవ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ సాగుకు కేంద్రం చేవ

August 17, 2017

తెలంగాణ సాగుకు ఊతం లభించింది. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా మొత్తం 99 సాగు నీటి ప్రాజెక్టుల కోసం రూ. 9,020 కోట్ల నిధులను కేటాయించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2018లో ఈ డబ్బును ఖర్చు చేస్తారు. ప్రాధాన్య పథకం, ఇందిరమ్మ వరద ప్రవాహ కాలువ పథకాల కింద.. కొమరం భీమ్, గొల్లవాగు, రాళ్లవాగు, మత్తడి వాగు, పెద్దవాగు(నీల్వాయి ప్రాజెక్టు), జగన్నాథ్ ప్రాజెక్టు, పాలెం వాగు, ఎస్సారెస్పీ రెండో దశ, రంగ సముద్రం, దేవాదుల తదితర ప్రాజెక్టులకు నిధులు సమకూరుతాయి. వివిధ సాగు నీటి ప్రాజెక్టుల కోసం రూ. 1,155 కోట్లను గ్రాంటుగా, నాబార్డు నుంచి మరో రూ. 2,5825 కోట్లను రుణాంగా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
కేంద్రం కేటాయించిన నిధులు అరకొరే అయినా కొత్త రాష్ట్ర ప్రాజెక్టులకు కాస్తయినా ఊరట లభించినట్టే.