శుభవార్త.. 12 నుంచి రైళ్లు ప్రారంభం.. షరతులు ఇవే - MicTv.in - Telugu News
mictv telugu

శుభవార్త.. 12 నుంచి రైళ్లు ప్రారంభం.. షరతులు ఇవే

May 11, 2020

Cetral government to start regular passenger trains 

భారత్‌కు జీవనాడులుగా పేరొందిన రైలు బండ్లు తిరిగి పట్టాలెక్కనున్నాయి. ఈ నెల 12 నుంచి రైళ్లను తిరిగి నడుపుతామని స్వయాం రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ప్రస్తుతం వలస కార్మికుల కోసం శ్రామిక్ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12 నుంచి ఢిల్లీ నుంచి దేశంలోని వివిధ నగరాలకు రెగ్యులర్ రైళ్లను నడుపుతామని, ఈ రోజు సాయంత్రం 4 నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. అయితే ఒకేసారి అన్నింటిని కాకుండా దశలవారీగా నడుపుతామని స్పష్టం చేశారు. 

ఢిల్లీ నుంచి 30 ప్రత్యేక రైళ్లను సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, మడ్గావ్వ్, తిరువనంతపురం, ముంబై సెంట్రల్, జమ్మూ తావి, అహ్మదాబాద్, డిబ్రూగర్, అగర్తలా, హౌరా, బిలాస్ పూర్, రాంచీ, పాట్నా, భువనేశ్వర్‌కు వెళ్తాయి. కరోనా వ్యాపించకుండా కొన్ని ఆంక్షలు అమలు చేస్తారు. కేవలం ఆరోగ్యంగా ఉన్నవారినే అనుమతిస్తారు. ప్రయాణికులు మాస్కులు పెట్టుకుని, సామాజిక దూరం పాటించాలి. ఐ‌ఆర్‌సి‌టి‌సి వెబ్ సైట్, లేదా మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలి. ఏజెంట్ల ద్వారా కొనుక్కోడానికి వీల్లేదు.