హైదరాబాద్‌లో చెడ్డీగ్యాంగ్.. భారీ ఎత్తున చోరీ - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో చెడ్డీగ్యాంగ్.. భారీ ఎత్తున చోరీ

October 25, 2019

Hayathnagar.

భాగ్యనగర వాసులను మరోసారి చెడ్డీగ్యాంగ్ కలవర పెడుతోంది. అర్దరాత్రి వేళ అదునుచూసి చోరీకి తెగబడుతున్నారు. తాాజాగా హయత్‌నగర్‌‌లోని పలు ప్రాంతాల్లో బీభత్సవం సృష్టించారు. కుంట్లూరులోని ఓ వేద పాఠశాలతో పాటు రెండు ఇళ్లలో చోరీకి తెగబడ్డారు. ఈ ఘటనలో బంగారం మొబైల్‌ ఫోన్స్,50 వేల నగదు అపహరించుకుపోయారు. 

రాత్రి సమయంలో కిశోర్‌స్వామి అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఇంట్లో వాళ్లను రాడ్లతో బెదిరించారు. వారిని తాళ్లతో కట్టేసి రూ. 50వేల నగదు, 11 తులాల బంగారం దొంగిలించారు.  ఆరుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి చెడ్డీలు వేసుకొని వచ్చారని బాధితులు వెల్లడించారు. వివరాలు తెలిసిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. దొంగల కోసం 10 ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని పోలీసులు స్థానిక ప్రజలకు సూచించారు.