chaina big Financial Support For Pakistan
mictv telugu

పాకిస్తాన్‌కు మరోసారి చైనా భారీ సాయం

November 8, 2022

chaina big Financial Support For Pakistan

తమది విడదీయరాని బంధం..మేము ఒకరికి ఒకరం.. అని పాక్, చైనా మరోసారి నిరూపించాయి. పీకల్లోతూ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు చైనా మరోసారి అండగా నిలిచింది. ఇబ్బందుల నుంచి పాకిస్థాన్‌ను బయటపడేసేందుకు ఏకంగా భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. సుమారు రూ.73 వేల కోట్లను సాయం అందించనుంది. ఇక్కడితో ఆగకుండా అవసరమైతే భవిష్యత్తులో మరింత సాయం అందించడానికి సిద్ధమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తెలిపారు.

శత్రువుకి శత్రువుకు మిత్రుడు అన్నట్టు భారత్‌తో వైరం వారద్దరిని ఆప్త మిత్రులుగా మార్చేసింది. భారత్‌ను దెబ్బకొట్టేందుకు పాకిస్తాన్‌కు కావాల్సినంత సాయం చేస్తునే ఉంటుంది. ఆర్థికంగా సాయం చేయడమే కాకుండా మిగతా విషయాల్లోనూ పాక్‌కు చైనా సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఫ్రెండ్షిప్‌లో భాగంగా పాకిస్తాన్‌లో హైడ్రోపవర్‌ డ్యామ్‌ నిర్మాణ పనులు కూడా చేపట్టింది. ఈ క్రమంలో మరోసారి భారీగా ఆర్థిక సాయాన్ని ప్రకటించి తమ స్నేహాన్ని నిరూపించుకుంది.