సరిహద్దులో చైనా సైన్యం......... - MicTv.in - Telugu News
mictv telugu

సరిహద్దులో చైనా సైన్యం………

July 20, 2017

భారత్, చైనాల మధ్య ఇన్నాళ్లు జరిగిన మాటల యుద్దం….. ఆ తర్వాత ఇద్దరు దేశ ముఖ్యనేతల మధ్య పరస్పర మెచ్చుకోళ్లు. అంతలోనే చైనా సైన్యం సరిహద్దులో మోహరింపు…….ఇదంతా  చైనా ఏం చేయాలని అనుకుంటున్నది. సిక్కిం సరిహద్దులో మరో సారి  సైన్యాన్ని మోహరించిందనే వార్తులు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. చైనా బెదిరింపులకు  జంకకుండా ఇండియా కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు వేలాదిగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని, వేల టన్నుల మిలిట్రీ పరికరాలను సరిహద్దులో చైనా దింపినట్లు హాంకాంగ్ కు చెందిన  చైనా మార్నింగ్ పోస్టు అనే పత్రికలో రాసింది.

అయితే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇండియాతో చైనా యుద్దం చేయడానికే సిద్దం అవుతున్నదనే  ప్రచారం జోరుగా సాగుతున్నది.  ఇరుదేశాల మధ్య గతంలోనూ ఓ యుద్దమూ జరిగింది. మరో సారి చైనా కయ్యానికి కాలు దువ్వుతున్నట్లేనా.. అనే అనుమానాలు వస్తున్నాయి. ఇరు దేశాల మధ్య ఏదైనా  సమస్య ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని కూడా చైనా మీడయా గతంలో రాసింది. మరిప్పుడు దీని గురించి ఏం రాస్తదో చూడాలి.

అయితే ఆయుధాల తరలింపు విషయాన్ని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన పీఎల్ ఎ డెయిలీ కూడా నిజమని చెప్పింది. డోక్లాం ఇష్యూను బేస్ గా చేసుకుని చైనా, భారత్ తో  కయ్యానికి సై అంటుందా  అని అనుమానించినా… ముందు ముందు అవసరాలు… ప్రపంచ ఆర్థిక అవసరాలు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలనే సూచనలూ వస్తున్నాయి. మరి చైనా ఏం చేస్తుందో చూడాలి. సరిహద్దులో జరుగుతున్న అన్ని పరిణామాలను భారత ప్రభుత్వం కూడా  సీరియస్ గా గమనిస్తూనే ఉన్నది. సరిహద్దులో జరుగుతున్న పరిణామాల గురించి విదేశాంగ కార్యదర్శి జయశంకర్ మంగళవారం పార్లమెంటరీ ప్యానెల్ కు చెప్పారు.