Chaina sending Monkeys to space 
mictv telugu

అంతరిక్షంలో సంతానోత్పత్తి సాధ్యమేనా?

November 8, 2022

అంతరిక్ష కేంద్రంలో జీవశాస్త్ర ప్రయోగాలను మరో మెట్టు పైకి తీసుకెళ్ళేందుకు చైనా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. భారరహిత స్థితిలో రీజనరేట్ ఎంతవరకు సాధ్యమనే దానిపై ప్రయోగాలు చేయనున్నారు. దీని కోసం స్పేస్ లోకి కోతులను పంపించనుంది చైనా స్పేస్ సెంటర్. అక్కడ కోతులను కొంత కాలం పాటూ ఉంచి అవి ఎలా పెరుగుతున్నాయి, పిల్లలను కనే అవకాశం ఎంత వరకు ఉంది అన్న అంశాలపై పరిశోధనలు చేస్తారుట.

చైనాలో కొత్తగా తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ను నిర్మిస్తున్నారు. దీని నిర్మణం కూడా దాదాపు పూర్తయిందని, కోతులను అంతరిక్షంలోకి పంపే ప్రక్రియ ఇక్కడ నుంచే జరగొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. కొత్త స్పేస్ సెంటర్ చివరి మాడ్యూల్ ను అంతరిక్షంలోకి పంపించామని కూడా చెప్పారు.

తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ లో కొంత భాగాన్ని జీవశాస్త్ర ప్రయోగాల కోసమే ప్రత్యేకంగా కేటాయించామని చెబుతున్నారు చైనా అంతరిక్ష పరిశోధకులు. జీవి పరిణామం మీద ఇక్కడ ప్రయోగాలు జరుగుతాయని తెలిపారు. కోతులను స్పేస్ లోకి పంపించి, అక్కడ వాటి లైంగిక జీవనం, పునరుత్పాదకత శక్తి పరీక్షిస్తామని వివరించారు. దీనికి ఎంత సమయం పడుతుంది అన్నది చెప్పలేమని అన్నారు. అంతరిక్ష ప్రయోగాలకు నేతృత్వం వహించే చైనా శాస్త్రవేత్త జాంగ్ లూ ఈ వివరాలు తెలిపారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ దీనిపై ఓ కథనం ప్రచురించింది.