Chairman Subbareddy revealed the value of TTD assets
mictv telugu

టీటీడీ ఆస్తుల విలువను వెల్లడించిన చైర్మెన్ సుబ్బారెడ్డి

September 24, 2022

Chairman Subbareddy revealed the value of TTD assets

టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన వాటినే శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించాలని నిర్ణయించారు.

దీనితో పాటు 95 కోట్లతో యాత్రికుల వసతి సముదాయాల నిర్మాణం, 30 కోట్లతో చెర్లోపల్లి నుంచి వకుళమాత ఆలయం వరకు రోడ్డు నిర్మాణం, టీటీడీ సిబ్బందికి ఇళ్ల స్థలాలు, నందకం గెస్ట్ హౌస్‌కు ఫర్నీచర్, క్లాస్ 4 సిబ్బంది యూనిఫామ్ కోసం రెండున్నర కోట్లు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా రూ. 25 కోట్లతో 130 ఎకకరాలు కొనుగోలు, నెల్లూరులో శ్రీవారి ఆలయ నిర్మాణం, తిరుపతిలో వసతి గృహాల కేటాయింపులను ఆమోదించారు. వీటితో పాటు టీటీడీ ఆస్తుల విలువను సుబ్బారెడ్డి వెల్లడించారు. మొత్తం రూ. 85 వేల 700 కోట్ల ఆస్తి ఉందని ఆయన ప్రకటించారు.