4 సార్లు గెలిచిన మంత్రిని కాదని.. ఛాయ్‌వాలాకు MLA టికెట్ - MicTv.in - Telugu News
mictv telugu

4 సార్లు గెలిచిన మంత్రిని కాదని.. ఛాయ్‌వాలాకు MLA టికెట్

October 21, 2022

'Chaiwallah' replaces 4-time Shimla Urban seat winner as candidate days before Himachal Assembly polls

 

త్వరలో జరగబోయే హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ.. తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కొత్తవారికి అవకాశం కల్పించే ఉద్దేశంతో.. కీలకమైన అసెంబ్లీ స్థానంలో నాలుగుసార్లు గెలిచిన మంత్రిని పక్కనబెట్టి.. ఓ చాయ్‌వాలాకు టికెట్ కేటాయించింది. శిమ్లా అర్బన్‌ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరఫున సంజయ్‌ సూద్‌ పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది బీజేపీ. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి రాష్ట్ర మంత్రి సురేశ్ భరద్వాజ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానం నుంచి సురేశ్ నాలుగు సార్లు గెలిచినప్పటికీ.. ఈ సారి ఆయనను పక్కనబెట్టి.. శిమ్లాలో చాయ్‌ దుకాణం నడిపే సంజయ్ కి టికెట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. కాగా.. మంత్రి సురేశ్‌ను మరో అసెంబ్లీ స్థానం కాసుంప్టి నుంచి నిలబెట్టింది.

ఇక అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వడంపై సంజయ్‌ ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయాలనే తపనతో 1980 నుంచే బీజేపీ కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. సంజయ్‌ గతంలో భాజపా శిమ్లా మండల్‌ అర్బన్‌కు జనరల్‌ సెక్రటరీగా పనిచేశాడు. ఆ తర్వాత జిల్లాలో పార్టీ మీడియా ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్నప్పుడు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ శిమ్లా యూనిట్‌ అధ్యక్షుడిగా ఉన్నారు.