చలపతిరావుకు గాయాలు.. నిచ్చెన ఎక్కబోతూ.. - MicTv.in - Telugu News
mictv telugu

చలపతిరావుకు గాయాలు.. నిచ్చెన ఎక్కబోతూ..

February 16, 2018

ప్రముఖ సీనియర్ నటుడు చలపతి రావు సినిమా షూటింగ్‌లో స్వల్పంగా గాయపడ్డాడు. శుక్రవారం హైదారాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా ప్రయాదానికి గురయ్యారు. అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ఓ మూవీ  షూటింగ్‌లో భాగంగా ఆయన బస్సు వెనుక ఉంచిన నిచ్చెన ఎక్కుతూ పట్టుతప్పి కిందపడ్డాడు. చిత్రయూనిట్ వెంటనే ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించారు.ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.  చలపతిరావు 4 దశాబ్దాలుగా  విలన్ పాత్రలతోపాటు ఇటీవల తండ్రి, మామ, తాత పాత్రలను పోషిస్తున్న సంగతి తెలిసిందే.