తండ్రి మంత్రి పదవి కోసం కూతురి క్షుద్ర పూజలు ! - MicTv.in - Telugu News
mictv telugu

తండ్రి మంత్రి పదవి కోసం కూతురి క్షుద్ర పూజలు !

July 18, 2017

పరకాల ఎమ్మేల్యేగా వున్న తండ్రిని ( చల్లా ధర్మారెడ్డి ) మంత్రిగా చూడాలనుకుంది ఆయన కూతురు మానస రెడ్డి. కన్నతండ్రి అత్యున్నత పదవులు చేపడితే చూసి ఆనందిద్దాం అనుకుంది. అందుకు స్ట్రేట్ వే కరెక్ట్ కాదనుకుంది. రాంగ్ గా, ఏదో మిరకిల్ జరిగినట్టు, మాయ జరిగి నాన్న వెంటనే మంత్రి అయిపోవాలనుకొంది. అనుకున్న తడవే క్షుద్ర పూజలు చేసే వాళ్ళను సంప్రదించింది. వీళ్ళు వరంగల్ సరౌండింగ్ ప్రాంతాల్లో కోయ పూజారులుగా చెలామణి అవుతున్నవాళ్ళు. పాస్తం నర్సింహరాజు అలియాస్ లక్ష్మణ్ రాజు. పాస్తం రాజు అలియాస్ వంశీలను పిలిపించి రూ. 57 లక్షలకు గాను పక్కా బేరం కుదుర్చుకుంది.

కోయదొరలు వాళ్ళ పూజల ప్రాసెస్ ను ప్రారంభించారు. అయితే ఈ ప్రాసెస్ ను ఎప్పుడు ప్రారంభించారనుకుంటున్నారూ ? పోయిన సంవత్సరం నవంబర్ నెలలో. అంటే ఎనిమిది నెలలుగా ఈ క్షుద్ర పూజల వ్యవహారం నిరాటంకంగా కొనసాగుతుందన్నమాట. వరంగల్ నగరంలో పలుచోట్ల, వారణాసి వంటి వివిధ ప్రాంతాలకు ప్లేసులు మారుస్తూ చాలా ఎఫెక్టివ్ గా పూజలు చేసారట. ఇలా ఈ ప్రాసెస్ జరుగుతోంది గానీ రిజల్ట్స్ మాత్రం నెగెటివ్ గానే వున్నాయ్. ‘ మంత్రాలకు చింతకాయలు రాలాలి కదా., ’ అనుకున్న తండ్రి చల్లా ధర్మారెడ్డి గారు, కంపెనీ ఖాతాల అవతవకలను గమనించి వెంటనే యాక్షన్ అనక తప్పలేదు. కానీ తనే డైరెక్టుగా యాక్షన్ అంటే ఉన్న ఇజ్జత్ పోవడమే కాదు, తన కన్ స్ట్రక్షన్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అయిన కూతురు లోకం దృష్టిలో బిత్తిరమ్మ అవుతుందని భావించి యాక్షన్ ను వియ్యంకుడితో అనిపించాడు. వెంటనే పోలీసులు ఎంత మాత్రం ఆలస్యం చెయ్యకుండా యాక్షన్ సీక్వెన్స్ లోకి దిగిపోయారు. ఆ జాదూగాళ్ళను అరెస్ట్ చేసారు. వాళ్ళ నుండి రూ. 50 లక్షలను తిరిగి తీసుకోగలిగారు.

ఏమిటో.. ఈ ప్రపంచంలో చదువురాని వారు అంతకే వున్నారు, చదువుకున్న వాళ్ళు అంతకే వున్నారు ? ఆశలు హద్దులు దాటితే ఏదైనా ఈజీగా కావాలనుకుంటారు చాలా మంది. అలాగే తన తండ్రిని మంత్రిగా చూడాలనుకొని కలలు కన్న ముద్దుల తనయగా మానస రెడ్డి మనకు గొప్ప ఉదార స్వభావిలా దర్శనమిస్తుంది. చల్లా ధర్మారెడ్డి 2014 ఎలక్షన్లలో టిడిపి నుండి ఎమ్మెల్యేగా గెలిచి, టీఆర్ ఎస్ పార్టీలో చేరారు. తండ్రి పదవుల కోసం పాకులాడుతున్నది కళ్ళారా చూసిన మానస అందుకు ఈ దారైతే ఈజీ అనుకుంది. ఈ ప్రపంచంలో కన్నపిల్లల ఎదుగుదలకు తల్లిదండ్రులు పాటు పడతారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. కన్నతండ్రి ఎదుగుదల కోసం కన్న కూతురు పరితపించడం నిజంగా గ్రేట్ మూమెంట్ కదా. కానీ అందుకు తను ఎంచుకున్న మార్గమే గుడ్డిది. ప్రాక్టికల్ గా కాకుండా ఏవో మాయలను, మంత్రాలను నమ్మి నిలువునా మోసపోవడమే కాదు, ఎమ్మెల్యేగా వున్న తండ్రి పరువును గంగలో కలిపేసిందనే చెప్పుకోవాలి.

మూఢ నమ్మకాలను అస్సలు నమ్మొద్దు

మనం ఏ జమానల వుండి ఏ జమానను తిరిగేస్కుంటున్నం ? ఈ మూఢ నమ్మకాలను అస్సలు నమ్మొద్దని నీతులు చెప్తున్నరు. మంత్రాలకు చింతకాయలు రాలే కాలం కాదు ఇది. ఈ జాతకాలను అస్సలు నమ్మొద్దు. నేను ఇంట్లో లేనప్పుడు నా కూతురుకి మాయ మాటలు చెప్పి డబ్బులు దండుకొన్నారు. దయచేసి ఇలాంటి కాలా జాదూగాళ్ళ మాయ మాటలు నమ్మి నా కూతురిలా మోసపోవద్దు.

మన సమాజమే అంత కావచ్చు. తనవరకొచ్చే సరికి చాలా గుడ్డిగా వ్యవహరించి మోసపోతున్నారేమో. కష్ట పడ్డవాడు ఎప్పటికైనా విజేతననే విషయాన్ని అందరూ తెలుసుకుంటే చాలా బాగుంటుందేమో !?