Challenge accepted..we will rewrite in 18 months : KTR
mictv telugu

ఛాలెంజ్‌ యాక్సెప్టెడ్‌..18 నెలల్లో తిరగరాస్తాం:కేటీఆర్

September 2, 2022

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు ట్విటర్ వేదికగా మణిపాల్‌ యూనివర్సిటీ ఛైర్మన్‌ ఓ సవాల్‌ను విసిరారు. ఆ సవాల్‌పై కేటీఆర్ స్పందిస్తూ..’ఛాలెంజ్‌ యాక్సెప్టెడ్‌, ఏడాదిన్నరలో తిరగరాసి చూపిస్తాం’ అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్విట్ నెట్టింట వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే..’చాలాకాలంగా తెలంగాణను పాలిస్తున్నది మీరే కదా, మీ రాష్ట్రంలో పోషకాహారలోప గణాంకాలు ఎలా ఉన్నాయో చూపించండి’ అంటూ మణిపాల్‌ యూనివర్సిటీ ఛైర్మన్‌ మోహన్‌ దాస్‌ సవాల్‌ విసిరారు. ఈ క్రమంలో ఆ సవాల్‌పై స్పందించిన కేటీఆర్..ఛాలెంజ్‌ యాక్సెప్టెడ్‌ అంటూ రీ ట్విట్‌ చేస్తూ.. ‘నా మాటలను గుర్తుంచుకోండి. తెలంగాణలో పోషకాహార లోపంపై ఉన్న గణాంకాలను రానున్న 18 నెలల్లో తిరగ రాస్తాం. కర్ణాటకలోని 40 శాతం కమిషన్ ప్రభుత్వాన్ని, గుజరాత్‌లో రేపిస్ట్ ఉపశమనాలను అధిగమిస్తాం. అమరవీరుల స్మారకాన్ని ఈ ఏడాది చివర్లో ప్రారంభిస్తాం’ అని కేటీఆర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.

ఇక, తెలంగాణలో అమరవీరుల స్మారకం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ అమరవీరులు స్మారకాన్ని తెలంగాణ కొత్త సచివాలయం ఎదుట లుంబినీపార్కు పక్కనున్న స్థలంలో అమరవీరుల స్మారకాన్ని నిర్మిస్తున్నారు. ప్రధాన పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రస్తుతం స్టీల్ క్లాడింగ్ పనులు కొనసాగుతున్నాయి. అనంతరం వెల్డింగ్ సహా ఇతర పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ క్రమంలో మణిపాల్‌ యూనివర్సిటీ ఛైర్మన్‌ మోహన్‌ దాస్‌ విసిరిన సవాల్‌‌ను స్వీకరించిన కేటఆర్..అమరులకు ఎల్లప్పటికీ రుణపడి ఉంటామని వ్యాఖ్యానించారు.