చాంపియన్స్ ట్రోఫీలో విఫలమైతే…ధోనీ కేరీర్ కు ఎండ్ కార్డేనా..?
సూపర్ స్టంపింగ్ తో అదరగోడుతున్న మిస్టర్ కూల్ కు బిగ్ టెస్ట్.. ఈ పరీక్షలో ఫెయిల్ అయ్యాడంటే అతని కెరీర్ ఇక ముగిసినట్లే. ఎప్పటిలాగే ధోనీ మాత్రం తనదైన స్టైల్లో కూల్‌గా ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తున్న అతనిలో పైకి కనిపించని ఏదో అలజడి..వచ్చే వరల్డ్ కప్ లో ధోనీ ఉండకపోవచ్చా..అసలేం జరుగుతోంది..ఏం జరుగబోతోంది..?
కెప్టెన్సీ వదిలేసుకున్న తర్వాత కేవలం ఓ ఆటగాడిగా టీమ్‌లో కొనసాగడమంటే అంతా ఈజీకాదు. ఎంత కష్టమో ధోనీలాంటి వాళ్లు చూస్తే తెలుస్తోంది.
చాంపియన్స్ ట్రోఫీ మిస్టర్ కూల్ కి అగ్ని పరీక్షే కాబోతుంది. రిషబ్ పంత్‌లాంటి యువ వికెట్ కీపర్లు రెడీగా ఉన్న టైమ్ లో ధోనీపై ఒత్తిడి మరింత ఉంది. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌తో ధోనీ మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. నెట్ ప్రాక్టీస్ లో ఓవైపు సీరియస్‌గా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూనే మధ్యమధ్యలో ఎమ్మెస్కేతో ధోనీ ముచ్చటించాడు. ఎమ్మెస్కే అతనికి బ్యాటింగ్ లేదా వికెట్ కీపింగ్ మెళకువలు మాత్రం కన్ ఫామ్ గా చెప్పలేదు.మరి వాళ్లిద్దరు ఏం మాట్లాడుకున్నారన్నదే హాట్ టాఫిక్ గా మారింది.
గతంలో కెప్టెన్సీ వదులుకునే ముందు ఎమ్మెస్కేతో ధోనీ చిట్‌చాట్ చేస్తూ కనిపించాడు. అది జరిగిన రెండు రోజులకే తాను తప్పుకుంటున్నట్లు ధోనీ ప్రకటించాడు. ఈ సారి వీరిద్దరి మధ్య సంభాషణ జరగడం ఆసక్తిరేపుతోంది. నెట్ సెషన్ సాగినంత సేపు ఇద్దరూ మాట్లాడుతూనే కనిపించారు. ధోనీ రిటైర్మెంట్‌పై చర్చ సాగిందా అన్న డౌట్స్ వస్తున్నాయి. వరల్డ్‌కప్ మరో రెండేళ్లు ఉన్న నేపథ్యంలో ధోనీ అంతవరకు కొనసాగుతాడా లేదా అన్నది సందేహమే. అతను ఒకవేళ కొనసాగలేకపోతే.. ఇప్పుడే ఓ యువ వికెట్ కీపర్‌కు చాన్స్ ఇవ్వడం మంచిది అన్న అభిప్రాయాలూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో చాంపియన్స్ ట్రోఫీలో ధోనీ విఫలమైతే మాత్రం అతని కెరీర్ ఇక ముగిసినట్లే.