Chance of rain in andrapradesh for three days
mictv telugu

బీ అలెర్ట్..మూడు రోజుల పాటు వర్షాలు

November 19, 2022

ఆదివారం నుంచి ఏపీలో భారీగా వర్షాలు కురిసే అవకావం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతున్న క్రమంలో తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు వెళ్తున్నట్లు వెల్లడించింది.

ఈ ప్రభావంతో ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అటు 40-55 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు.