‘చందమామ’ బొమ్మల తాతయ్య కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

‘చందమామ’ బొమ్మల తాతయ్య కన్నుమూత

September 29, 2020

Chandamama artist Shankar passed away .

చందమామ కథల పత్రిక ద్వారా నాలుగు తరాల భారతీయులను తన బొమ్మలతో మురిపించిన శంకర్ తాతయ్య ఇక లేరు. 97 ఏళ్ల ‘చందమామ’ శంకర్ ఈ రోజు వృద్ధాప్య సమస్యల కారణంగా చెన్నైలో తుది శ్వాస విడిచారు. ఆయన అసలు పేరు కరత్తొలువు చంద్రశేఖరన్ శివశంకరన్. 1924లో తమిళనాడులోని ఈరోడ్‌లో జన్మించిన శంకర్ 1946 నుంచి ఆఖరి శ్వాసవరకు బొమ్మలే జీవితంగా గడిపారు. 

చందమామ పత్రిక అన్ని ప్రముఖ  భారతీయ భాషల్లో వెలువడ్డంతో ఆయన దేశమంతా తెలిసిన కళాకారుడయ్యారు.  భేతాళకథల బొమ్మలు సహా ఎన్నో సీరియళ్లు, వేల కథలకు ఆయన బొమ్మలు సింగారించారు. పిల్లలను, పెద్దలు ఆకట్టుకునే ఆయన బొమ్మలు తీరుతెన్నులు అచ్చం భారతీయమైనవే. బాల్యం నుంచే చిత్రాలపై ఆసక్తి చూపిన శంకర్ 1941లో మద్రాస్ గవర్నమెంట్ ఫైనార్ట్స్ కాలేజీలో చేరి శిక్షణ పొందారు. నాగిరెడ్డి, చక్రపాణి ప్రారంభించిన చందమామ అతని కెరీర్‌కు బాటలు వేసింది.