చండీగఢ్ లోని ఓ ప్రైవేట్ వర్సిటీలో విద్యార్థినులు స్నానం చేస్తుండగా.. వీడియోలు తీసిన యువతి.. వారిలో ఒకరి చావుకి కారణమైంది. తమ వీడియోలు ఇంటర్నెట్ లో , సోషల్ మీడియాలో వైరలవుతుండడాన్ని అవమానించిన విద్యార్థినుల్లో 8 మంది మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు మృతిచెందారు. వీడియోలు వైరల్ చేసిన యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
This girl viral the 60 girls mms in Chandigarh university kindly take strict action on this girl @INCChandigarh @narendramodi @ChandigarhUT #chandigarhuniversity #justiceforcugirls pic.twitter.com/7JVHN0oBNZ
— Shanu XD (@shanu00001) September 17, 2022
స్నానం చేస్తున్న 60 మంది బాలికల నగ్న వీడియోలను మరో విద్యార్ధిని తీస్తూ పట్టుబడింది. సుమారు 60 మంది విద్యార్ధినుల నగ్న వీడియోలను సిమ్లాలోని తన బాయ్ ఫ్రెండ్ కు పంపినట్టుగా తెలిసింది. ఈ వీడియోలను అతను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ విషయమై బాధిత విద్యార్ధినులు ఆందోళనకు దిగారు. మొహలీకి చెందిన విద్యార్ధిని యూనివర్శిటీలో చదువుతున్న తమ సహచర విద్యార్ధినుల నగ్న వీడియోలను తీసింది. స్నానం చేసే సమయంలో ఆమె ఈ వీడియోలను రికార్డు చేసింది. సిమ్లాలో ఉన్న తన స్నేహితుడికి ఈ వీడియోలను పంపింది. ఈ వీడియోలను నిందితుడు యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు. ఈ విషయం తెలిసిన బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడిందని స్థానిక మీడియా రిపోర్టు చేసింది.
ఈ ఘటనపై పంజాబ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ స్పందించారు. ఘటనకు పాల్పడిన నిందితులపై చర్యలు తీసుకొంటామని ప్రకటించారు. దోషులు ఎవరూ కూడ తప్పించుకోలేరని ఆయన తేల్చి చెప్పారు.