టీవీ లైవ్ డిబెట్‌లో మర్డర్ కేసు ఒప్పుకున్నాడు..పోలీసుల ఎంట్రీతో - MicTv.in - Telugu News
mictv telugu

టీవీ లైవ్ డిబెట్‌లో మర్డర్ కేసు ఒప్పుకున్నాడు..పోలీసుల ఎంట్రీతో

January 16, 2020

Live Debate.

నిజం ఎంత దాచినా దాగదు. ఏదో ఒక రోజు బయటకు రావల్సిందే. అలాంటి ఓ ఘటన ఛండీఘడ్‌లో జరిగింది. 10 ఏళ్ల క్రితం హత్య తాను చేసిన హత్యను ఓ టీవీ ఛానెల్ లైవ్ డిబేట్‌లో దర్జాగా అంగీకరించాడు. అతడు చెప్పిన మాటలతో ఆ డిబెట్ పూర్తికాక ముందే పోలీసులు అరెస్టు చేశారు. షో మధ్యలోనే వారు ఎంట్రీ ఇచ్చి కటకటాల్లోకి నెట్టారు. ఈ చర్యతో నిందితుడు ఒక్కసారిగా విస్తుపోయాడు. హత్యపై పూర్తి వివరాలను తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. 

క్యాబ్ డ్రైవర్ గా పని చేసే మహీందర్ సింగ్ ఇటీవల ఓ టీవీ లైవ్ డిబెట్‌కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా యాంకర్ వేసిన ప్రశ్నలో భాగంగా తాను 2010లో తన ప్రియురాలు సరబ్జిత్ కౌర్‌ను హత్య చేసినట్టు  అంగీకరించాడు. ఆమెపై అనుమానంతో ఈ పని చేసినట్టు వెల్లడించారు. కొత్త సంవత్సర వేడుకలకు పిలిచి ఓ హోటల్‌లో హతమార్చినట్టు వెల్లడించాడు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు హుటా హుటిన టీవీ చానెల్ వద్దకు చేరుకున్నాడు. మహీందర్ సింగ్ స్టుడియోలో ఉండగానే లోపలికి వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లారు. దాదాపు పదేళ్ల తర్వాత ఈ హత్య కేసును నేరుగా నిందితుడే ప్రత్యక్ష ప్రసారంలో అంగీకరించడం విశేషం. కాగా గతంలోనూ ఇతనిపై మరో హత్య కేసు ఉందని ఇటీవలే అతడు బెయిల్‌పై వచ్చినట్టు పోలీసులు వెల్లడించారు.