దీనికి బదులివ్వండి..... - MicTv.in - Telugu News
mictv telugu

దీనికి బదులివ్వండి…..

August 8, 2017

ఈ అమ్మాయి వేసిన ప్రశ్నకు బిజెపి హర్యాయాణ  అధ్యక్షుని కూసాలు కదిలి పోయి ఉంటాయి. హరియాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుని కుమారుడు వికాస్ బరాలా, ఆయన స్నేహితుడు, వర్నికా అనే అమ్మాయిని వేధించారు. తన మిత్రులను కల్సి రాత్రి పూట కారులో ఇంటికి వెళ్తున్నప్పుడు  ఆమె వేధింపులకు గురైంది. అయితే  తనను వేధించారని చెప్తే..అంత రాత్రి పూట బయటకు ఎందుకు వెళ్లావు. తాగి ఉంటే ఇట్లాగే చేస్తారన్నట్లు సదరు నాయకుడు సెలవిచ్చారు. దానికి వర్నక సోషల్ మీడియాలో చాలా ఘాటుగా రిప్లై ఇచ్చారు.  తాను  మిత్రులును కల్సి  వస్తున్న మార్గంలో బిజెపి నాయకుని కుమారుడు, అతని స్నేహితులపై తనపై వేధింపులకు పాల్పడ్డారని చెప్పారు. అంతే కాదు నేను రాత్రి పూట ఎందుకు బయటకు వెళ్లానో…. వెళ్ల కూడదో అడగటానికి మీరెవరని ప్రశ్నించారు. వర్నిక ఓ కలెక్టర్ కుమార్తె.  రాత్రి పూట అమ్మాయిలు  కార్లల్ల, బస్సుల్ల, నడుచుకుంటూ అస్సలు బయటకు పోకూడదా…. తిరగనే వద్దా…ఏందో ఈ బిజెపి నాయకుని ప్రశ్న. సోషల్ మీడియాలో అమ్మాయికి మాంచి మద్దతు వస్తున్నది.