221 అడుగుల మహారావణ్.. 30 లక్షలతో - MicTv.in - Telugu News
mictv telugu

221 అడుగుల మహారావణ్.. 30 లక్షలతో

September 25, 2019

దసరా వేడుకలకు దేశం యావత్తు సిద్ధం అవుతోంది. ముఖ్యంగా దసరా రోజున రావణ దహనం చేయడం ఆనవాయితీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఛండీఘర్‌లో రావణ దహన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఓ సంస్థ భారీ ఏర్పాట్లు చేస్తోంది. 221 ఫీట్ల ఎత్తులో రావణుడి దిష్టిబొమ్మను నిర్మిస్తున్నారని ఆ సంస్థకు చెందిన ఓ నిర్వాహకుడు వెల్లడించారు. ఈ దిష్టిబొమ్మను తయారు చేసేందుకు రూ. 30 లక్షలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఈ బొమ్మ బరువు సుమారు 70 క్వింటాళ్లు ఉంటుందని.. దీని నిర్మాణం అక్టోబర్ 2వ తేదీ వరకు పూర్తి చేశాక సందర్శనకు పెడుతామని చెప్పారు.

Ravana.దీంతో మరోసారి ప్రపంచ రికార్డు నెలకొల్పబోతున్నామని ఆనందం వ్యక్తంచేశారు. ‘అక్టోబర్ 3 నుంచి 7వ తేదీ వరకు రావణుడి దిష్టిబొమ్మ ముందు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. అక్టోబర్ 8న జరిగే దసరా రోజున రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తాం. ఈ దిష్టిబొమ్మలో ఉపయోగించిన బాణాసంచా కాలుష్యరహితంగా ఉంటుంది’ అని తెలిపారు. కాగా, గతేడాది రావణుడి దిష్టిబొమ్మను 210 ఫీట్ల ఎత్తులో తయారు చేశారు. ఇప్పుడేమో గతేడాది కంటే 11 ఫీట్ల ఎత్తులో తయారుచేయడం విశేషం.