Chandoor Key Role In Munugode Result
mictv telugu

9,10 రౌండ్లు బీజేపీని నిలబెడతాయా?

November 6, 2022

ఇప్పటిదాకా ఒక లెక్క..ఇప్పటినుంచి మరోలెక్క. చండూరు మండలమే మునుగోడు మొనగాడు ఎవరో తేల్చబోతోంది. ఇక్కడ వచ్చే లీడే విజేతను డిసైడ్ చేయచేయబోతోంది. ఈ మండలం ఓటర్లు టీఆర్ఎస్ వైపు ఉన్నారా?బీజేపీ వైపు ఉన్నారా అనేది ఉత్కంఠ రేపుతోంది. 9,10 రౌండ్లలో లెక్కించే ఓట్లే మునుగోడు కింగ్ ఎవరో తేల్చబోతున్నాయి.

ఇప్పుడు అందరి దృష్టి చండూరు మండలంపైనే ఉంది. 9, 10 రౌండ్లలో చండూరు ఓట్లు లెక్కిస్తారు. మునుగోడు తీర్పులో ఈ ఓట్లే కీలకంగా మారాయి. 9.10 రౌండ్లలో మంచి లీడ్ వస్తుందని బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఇక్కడ ఎక్కువ ఓట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. చండూరులో ఓటర్లు ఎక్కడ మొగ్గితే వాళ్లనే విజయం వరించబోతుంది. ఇక్కడ ఎక్కువగా ఆర్చన్ ఓట్లు ఉన్నాయి. యువత ఓట్లు కూడా భారీగా ఉన్నాయి. సైలెంట్ ఓటూ గట్టెక్కిస్తుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు.

చండూరు వాసులు తమవైపే ఉంటారని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. మండలం మొత్తం తమపార్టీవైపే ఉన్నారని చెబుతున్నారు. పట్టణ, గ్రామీణ ఓటర్లు కూసుకంట్ల ప్రభాకర్ రెడ్డికే పట్టం కడతారని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు.