చంద్రబాబు జీవితంపై సినిమా...! - MicTv.in - Telugu News
mictv telugu

చంద్రబాబు జీవితంపై సినిమా…!

September 14, 2017

ఇప్పుడంతా బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది. బాలీవుడ్ లో తీసిన బయోపిక్ లన్ని దాదాపు హిట్టే. తెలుగులో ఇప్పుడిప్పుడే బయోపిక్ ల ట్రెండ్ ప్రారంభమైంది.  అయితే ఎక్కో బయోపిక్ లు మాత్రం, ఆటల మీదే వచ్చాయి. ఇంకొన్ని బయోపిక్ లు వీరుల మీద వచ్చాయి. అయితే ఇప్పుడు రాజకీయ నాయకుల బయోపిక్ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ సియం చంద్రబాబు జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ రాబోతుంది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ కూడా పూర్తైందని సమాచారం.

ఈసినిమాని చంద్రబాబు అభిమాని పసుపులేటి వెంకట్ రామ నిర్మిస్తున్నారట. కొందరు ఎన్నారైలు కూడా ఈసినిమాకి పెట్టుబడి పెడుతున్నట్టు సమాచారం. ఈసినిమాలో చంద్రబాబు ఎదుర్కున్న సవాళ్లు, సియంగా ఆయన సాధించిన విజయాలు…అన్ని చూపించబోతున్నారట. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే అవరావతిలో చంద్రబాబు చేతుల మీదుగా ట్రేలర్ ను రిలీజ్ చేస్తారట. ఇగ తెలంగాణ సియం కేసీఆర్ బయోపిక్ కూడా రెడీ అవుతుంది. సో ఇద్దరు చంద్రుల  జీవిత చరిత్రలు త్వరలోనే మనం టాకిస్లలో చూడబోతున్నామన్నమాట.