ఎన్ని ఎక్కువ కేసులుంటే అంత భవిష్యత్తు : చంద్రబాబు - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్ని ఎక్కువ కేసులుంటే అంత భవిష్యత్తు : చంద్రబాబు

May 5, 2022

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలో నేడు పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘పనితీరు, సేవల ఆధారంగానే భవిష్యత్తులో అవకాశాలుంటాయి. ఆర్ధికంగా సహాయపడేవాళ్లకు ప్రత్యేక స్థానముంటుంది. జగన్ లాంటి సైకోలను అణచివేసే బాధ్యత మనపై ఉంది. కేసుల గురించి ఎవ్వరూ భయపడొద్దు. ఎన్ని కేసులు నమోదైతే అంత ఎక్కువ భవిష్యత్తు ఉంటుంది. కేసుల కోసం ప్రత్యేకంగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి పరిష్కరిస్తా. రాబోయే ఎన్నికల్లో మన గెలుపు ఎలా ఉండాలంటే వచ్చే 30 ఏళ్లూ మన పార్టీనే అధికారంలో ఉండాలి’ అంటూ హితబోధ చేశారు.