చంద్రమోహన్ కూతురి డ్యాన్స్‌కు ఇవాంకా ఫిదా - MicTv.in - Telugu News
mictv telugu

చంద్రమోహన్ కూతురి డ్యాన్స్‌కు ఇవాంకా ఫిదా

November 30, 2017

విశిష్ట నటుడు చంద్రమోహన్ కుమార్తె, కూచిపూడి నర్తకి మాధవి నంబూద్రి.. మంగళవారం రాత్రి ఫలక్‌నుమా ప్యాలస్‌లో తన నృత్యంతో ఆహూతులను అలరించారు. అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్, ప్రధాని మోదీ తదితర ప్రముఖులు దీన్ని వీక్షించారు. మాధవి నర్తనానికి ఫిదా అయిపోయి ‘వన్స్ మోర్’ అని చప్పట్లు కొట్టారు. జీఈఎస్ సదస్సు కోసం వచ్చిన ప్రతినిధులకు ఈ ప్యాలస్ లో విందు ఇచ్చి తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.అందులో భాగంగా కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, కథక్‌, మణిపురి వంటి భారతీయ నృత్యాల కలయికతో మన దేశంలోని భిన్నత్వంలోని ఏకత్వం ఆధారంగా ఒక రూపకాన్ని ప్రదర్శించారు.  చెన్నైకి చెందిన డాక్టర్‌ సత్యప్రియ రమణ దీన్ని రూపొందించారు. ఆయన శిష్యుబృందలోని మాధవి తదితరులు పాదాలు కదిపారు. గంటపాటు సాగిన ఈ రూపకం ఆద్యంతం రసోపేతంగా సాగింది.  ఆఖర్న మంగళంపల్లి బాలమురళీకృష్ణ స్వరపరచిన థిల్లానానూ ప్రదర్శించారు. సమయం లేకపోయినా కఠిన శిక్షణ తీసుకుని అతిథులను అలరించామని మాధవి చెప్పింది. మాధవి తల్లి జలంధర ప్రముఖ రచయిత్రి.