Chandrababu arranged a meeting with Kuppam TDP leaders
mictv telugu

జగన్ వల్ల తెలుసుకొని వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది : చంద్రబాబు

November 19, 2022

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంపై శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో పలు విషయాలు పంచుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కుప్పంలో జైళ్లు, పోలీస్ స్టేషన్లు, కోర్టుల అవసరం రాకూడదని అనుకునేవాడిని. ఒక ప్రశాంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ప్రయత్నించాను. అలాంటిది వైసీపీ పాలన వల్ల నేనే లాయర్లను వెతుక్కోవాల్సి వచ్చింది. విద్యార్ధిగా ఉన్నప్పుడు ఐపీసీ సెక్షన్ల గురించి చదువుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ జగన్ రెడ్డి వల్ల నేడు వాటిని తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కార్యకర్తలు భయపడాల్సిన పని లేదు. అన్ని నియోజకవర్గాల్లో లీగల్ టీంలు పనిచేస్తున్నాయి. కుప్పంలో 70 మందిని అరెస్ట్ చేసి 20 రోజులు జైల్లో పెట్టారు. అర్ధరాత్రులు పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే ఏకేసుపై అరెస్ట్ చేస్తున్నారో రాతపూర్వక నోటీసులు అడగండి. స్టేషనులో విచారణ చేస్తే సీసీ కెమెరాల్లో రికార్డ్ చేయమని అడగండి. మనం ఒక సైకోను ఎదుర్కొంటున్నాం. ఇలాంటి వారిని కట్టడి చేయాలంటే పార్టీ నాయకులు ప్రజా సమస్యలపై అత్యంత చురుకుగా పని చేయాలి’ అని వారిలో స్పూర్తి నింపారు.