ట్రంప్ విందుకు జగన్‌ను పిలవకపోవడంపై చంద్రబాబు సటైర్ - MicTv.in - Telugu News
mictv telugu

ట్రంప్ విందుకు జగన్‌ను పిలవకపోవడంపై చంద్రబాబు సటైర్

February 25, 2020

dgdthgch

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కోసం రాష్ట్రపతి ఇచ్చే విందుకు ఏపీ సీఎం జగన్‌ను పిలవకపోవడంపై చంద్రబాబు స్పందించారు.  ఆర్థిక నేరగాడు కాబట్టే ఆహ్వానం అందలేదని ఆక్షేపించారు. చిత్తూరు జిల్లాలో మంగళవారం జరిగిన టీడీపీ కార్యకర్తలతో జరిగిన ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో రాష్ట్రానికి పెట్టుబడులు కూడా రావడం లేదని ఆరోపించారు. అమరావతి, అభివృద్ధి కోసం యువత పోరాడాలని పిలుపునిచ్చారు.

కాగా భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా ట్రంప్ కోసం ప్రత్యేకంగా విందు ఇవ్వనున్నారు.  ఈ కార్యక్రమానికి కేవలం అతికొద్ది మంది ముఖ్యమంత్రులకు మాత్రమే ఆహ్వానం అందించారు. దక్షిణాది నుంచి తమిళనాడు, కర్నాటక, తెలంగాణ సీఎంలు ఈ విందులో పాల్గొననున్నారు.వీరితో పాటు బీజేపీ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, మహారాష్ట్ర సీఎం, కేంద్ర మంత్రులకు ఆహ్వానం అందింది. ప్రధానంగా ఐటీ సంస్థలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల సీఎంలకు మాత్రమే ఈ అవకాశం లభించినట్టుగా తెలుస్తోంది.