కొత్త జిల్లాలపై చంద్రబాబు.. మేం వచ్చి సరిచేస్తాం - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త జిల్లాలపై చంద్రబాబు.. మేం వచ్చి సరిచేస్తాం

April 4, 2022

15

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పందించారు. కొత్త జిల్లాల ప్రక్రియ రాజకీయ కోణంలో జరిగిందనీ, మేం అధికారంలోకి వచ్చాక వాటిని సరిచేస్తామని ప్రకటించారు. సోమవారం రాష్ట్రనేతలతో తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు సీఎం జగన్‌ను తీవ్రంగా విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపు, పన్నుల పెంపు వంటి అంశాలతో ‘బాదుడే బాదుడు’ అనే నినాదంతో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. అక్రమ మద్యం ద్వారా వేల కోట్ల రూపాయల వ్యక్తిగత ఆదాయం పెంచుకుంటున్నారని మండిపడ్డారు. అమరావతిలో 80 శాతం పూర్తయిన పనులను కూడా పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వమని దుయ్యబట్టారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండడం పట్ల ఆయన సొంత సామాజిక వర్గం కూడా సంతృప్తిగా లేదని వెల్లడించారు. జగన్‌కు ఓటేసి తప్పు చేశామన్న భావన వారిలో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని   వ్యాఖ్యానించారు.