tdp chief Chandrababu criticized YS Jagan on Polavaram
mictv telugu

20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలిసిపోతుంది

December 1, 2022

Chandrababu criticized YS Jagan on Polavaram

టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉభయగోదావరి జిల్లాల పర్యటనలో ఉన్న ఆయన.. గురువారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లగా పోలీసులు అనుమతించలేదు. దీంతో నిరసనగా పోలవరం ముఖద్వారం వద్ద బైఠాయించారు. అనంతరం వైఎస్ జగన్ పాలనను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. తనకు 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో తెలిసిపోతుందని, ఆ శక్తి తనకు దేవుడిచ్చాడని అన్నారు. అందుకే అందరికన్నా ఆలోచనల్లో ముందుంటానని, అందులో నేనే యంగ్ అని తెలిపారు. అధికారంలోకి వస్తే పోలవరాన్ని జిల్లా చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అందులో పోలవరంలోని మండలాలన్నీ కలుపుతామని ప్రకటించారు. కాగా, చంద్రబాబుకు నక్సలైట్ల వల్ల హాని ఉందనే కారణంతో పోలవరం సందర్శనకు అనుమతివ్వలేదని పోలీసులు వెల్లడిస్తున్నారు. డయా ఫ్రం వాల్ ఏమైందో తెలియదని, వైసీపీ తన కక్కుర్తి, కమీషన్ల కోసం ప్రాజెక్టుని బలి చేస్తోందని దుయ్యబట్టారు. భవిష్యత్తు, భావి తరాల కోసం ఆలోచించే ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు.

 

Chandrababu criticized YS Jagan over Polavaram
Chandrababu, criticize, YS Jagan, Polavaram, ap