Chandrababu fires on ycp government
mictv telugu

పవన్ కళ్యాణ్‌ ను చంపేస్తారా ?

November 3, 2022

ఏపీ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. తాజా పరిణామాలతో రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితుల ఏర్పడ్డాయి. టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని అరెస్ట్ చేయడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి ముందు అపరిచిత వ్యక్తులు సంచరించడం వంటి అంశాలు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ ఘటనలపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తారు.

ప్రశ్నిస్తున్నవారిపై కేసులు పెట్టడం, వేధించడం వైసీపీ అరాచక పాలనకు నిదర్శనమని చంద్రబాబు మండిపడ్డారు. తెల్లవారు జామున 3 గంటలకు వెళ్లి అయ్యన్నను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. పోలీసులు తాగి గోడలు దూకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. కొంతమంది అధికారులు తప్పుడు విధానాలతో ముందుకు వెళ్తున్నారన్న చంద్రబాబు.. అలాంటి వారిని వదిలి పెట్టేదే లేదని హెచ్చరించారు. ధైర్యం ఉంటే జగన్‌ బాబాయిని హత్యచేసిన వారిని అరెస్టు చేయాలని సవాల్ విసిరారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ మీద దాడులకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్ కల్యాణ్ ఎక్కడ ఉంటే అక్కడ దాడులు చేస్తారా ?
రెక్కీ నిర్వహిస్తారా ? చంపేస్తారా ? అంటూ బాబు ప్రశ్నించారు.