చంద్రబాబు ఇంటి వద్ద కారు దగ్ధం - MicTv.in - Telugu News
mictv telugu

చంద్రబాబు ఇంటి వద్ద కారు దగ్ధం

November 24, 2017

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఇంటి వద్ద శుక్రవారం ఓ కారు తగలబడిపోయింది. ఉండవల్లి కరకట్ట వద్ద  మహీంద్ర XUV కారులో ఒక్కసారిగా మంటలు లేచాయి. కారులో ఉన్నవారు వెంటనే దిగిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు.మంటల ధాటికి కారు పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులు రాయపూడి మీదుగా వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాదం సీఎం ఇంటి వద్ద జరగడంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టిముట్టి హై అలర్ట్ ప్రకటవించారు.