వెక్కి వెక్కి ఏడ్చేసిన చంద్రబాబు - MicTv.in - Telugu News
mictv telugu

వెక్కి వెక్కి ఏడ్చేసిన చంద్రబాబు

November 19, 2021

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చారు. అసెంబ్లీ తనను దారుణంగా అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తిరిగి ముఖ్యమంత్రిని అయ్యాకే సభలో అడుగుపెడతానని శపథం చేసి సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. తర్వాత పార్టీ ఆఫీసులో విలేకర్ల సమావేశంలో మాట్లాడు. బాధతో కాసేపు మౌనంగా ఉండిపోయిన ఆయన తర్వాత భోరుమని విలపించారు. ప్రజల కోసమే తాను పోరాడుతున్నాని, అయితే తనపై ద్వేషంతో తనతోపాటు తన కుటుంబ సభ్యులను కూడా బండబూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.